Mystic Temple of Mangalagiri – Sri Laxmi Narasimha Swamy
శ్రీ దుర్గా మాత అమ్మవారి దర్శనంతో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది అక్కడి నుంచి బయలుదేరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దర్శన సంకల్పం తొ బయలుదేరాం.
ఇది ఒక దివ్య క్షేత్రం. సైన్స్ పరంగా చూసిన వైదిక పరంగా చూసిన ఒక మహా అద్భుతం. ఇక్కడ సాక్షాత్తు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఒక పర్వతంపై వెలిశారు.
మీరు అడగవచ్చు అలాంటివి చాలా చూశాం కద దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి?
త్రేతాయుగము నాటి నుంచి ఉన్న ఈ దేవాలయం ఒక ప్రత్యేక చమత్కారమే ఉంది. ఎవరు కనుక్కున్నారో తెలీదు. ఎలా కనుక్కున్నారు అసలే తెలీదు అయితే ఇక్కడ పర్వతపు మధ్యలో ఒక మహా అంతుచిక్కని రంధ్రం ఉంది. ఇలా ఏండ్లుగా అంటే త్రేతాయుగంలో అమృతం ద్వాపర యుగంలో ఆవు పాలు ఇప్పుడు కలియుగంలో పానకం రోజు పోస్తున్న ఇప్పటికీ ఆ రంద్రం మూసుకుపోలేదు ఇది ఒక సైన్స్ పరంగా అంతుచిక్కని రహస్యం. వైదిక శాస్త్రపరంగా మన ఋషులు దీనిని శోధించి తమ తపశక్తితో ఇక్కడ ఆ మహావిష్ణువు లక్ష్మీ నరసింహ అవతారంతో ఉన్నాడని హిరణ్యకశపుడి వధ తర్వాత స్వామివారు ఈ పర్వతం లోపల సేద తీరారని ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని శాంత పరచడానికి భక్తులు పానకం అర్పిస్తారని ప్రసక్తి. ఇంకో అద్భుతం ఏమిటంటే ఎవరైనా ఎంత పానకం తెచ్చిన దానిలో సగం మాత్రమే స్వామివారి స్వీకరిస్తారు మిగతా సగం బయటికి వచ్చేస్తుంది. రోజు కొన్ని వందల భక్తులు మంచి బెల్లంతో చేసిన పానకం స్వామివారికి సమర్పిస్తున్నప్పటికీ ఆ గుడిలో అంతపానకం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఒక చిన్న చీమ గాని చీమల దండు గాని కనపడదు ఇది ఇంకొక విచిత్రం.
దేవాలయం ఒక చిన్న కొండ పైన ఉంటుంది కొండ కింద భాగమున అపురూపమైన గోపురం ఉంది అది తప్పక చూడాల్సిందే. గూగుల్ మ్యాప్ తో మేం వెళ్లేటప్పుడు అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నందున కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ అక్కడ జనాలు మాకు సరి దారి చూపించారు. కొండమీద కారు పార్కింగ్ స్థలం చాలా విశాలంగా ఉంది. పైనుంచి నుంచి చుట్టూ ఉన్న ప్రదేశాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి కనిపిస్తాయి. గుడి లోపలికి వెళ్లే ముందు 50 రూపాయల తో పానకం కొనుక్కోవచ్చు. మనకు ఒక చిన్న బిందెలో ఇస్తారు అది తీసుకెళ్లి అర్చకులకు సమర్పించిన వాళ్లు మహానిష్టతో స్వామివారి నోటిలో పోస్తారు. మిగిలిన సగం పానకం మనకు ప్రసాదంగా ఇస్తారు. నేను మొదట పానకం పల్చగా నీళ్లలాగా ఉంటుందేమో అని అనుకున్నా కానీ తాగినప్పుడు తెలిసింది అది ఎంత పవిత్రంగా ఉందో ఎంత స్వచ్ఛంగా తయారు చేశారు. మీరు మాత్రం ఇది ఎప్పుడు మిస్ అవ్వకండి.
ఈ యొక్క వింత మళ్లీ వీక్షిద్దామని ఇంకొకసారి కూడా వెళ్లి స్వామివారి దర్శనము పానకం సమర్పించడం చెసాం. అర్చకులు కూడా ఎంతో సంతోషంగా మాకు కావలసినంత పానకం అందించారు. ఇంత అద్భుతం మన దగ్గరే ఉండి ఇన్ని రోజులు తెలియలేదు అని కూడా అనిపించింది. గుడి బయట మంచి ప్రకారం లో కూర్చొని మాధురి, శ్వేత కార్తీక దీపాలని వెలిగించారు. అక్కడే గుడి పక్కన ఒక చిన్న మెట్ల వరస ఉంది పైకి వెళ్లడానికి. పైన గృహలో అమ్మవారు ప్రతిష్టించబడ్డారు. అమ్మవారి దర్శనం చేసుకుని చుట్టూ కనిపిస్తున్న విశాలమైన విజయవాడ ప్రాంతాన్ని చూస్తూ మేము అక్కడే కాసేపు గడిపాము. ఈ దేవాలయాన్ని దాని యొక్క ప్రాముఖ్యతని ఇంకా ఎంతో మందికి, మన పిల్లలకు తప్పకుండా చెప్పి తీసుకెళ్లాలి ఇది మన కర్తవ్యం.
మంగళగిరి లో ఇంకొక ప్రాముఖ్యత ఉంది. మంగళగిరి కాటన్ చీరలు చాలా ప్రసిద్ధి. ఏముంది నాకు లలిత్ కు ఇంకో చాయిసే లేదు, మాధురి, స్వాతి ఇద్దరు అక్కడ గుట్ట కింద ఉన్న మంగళగిరి చీరల షాపులోకి సెటిలైపోయారు. అర్ధగంటలో దర్శనం చేసుకుని బయలుదేరుదాం అనుకున్న మేము దాదాపు రెండు గంటలు అక్కడే ఉండిపోయాం.
ఇది ఒక ప్లాన్ లేని ప్లాన్ ట్రిప్. అక్కడి నుంచి అమరావతి క్షేత్రాన్ని దర్శిద్దామనుకున్న మేము ఇంకా లేట్ అయిపోయిందని ద్వారకా తిరుమల కి బయలుదేరాము.